AP: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6,160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించిందని వెల్లడించారు. 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుందనేందుకు ఈ ఘనతే సాక్ష్యమన్నారు. జెన్కో ప్లాంట్ల కార్మికులు, ఉద్యోగులకు, శాఖా మంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.