నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌తో బిజీగా ఉండగా, ఆ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రంలో నటించనున్నాడు. ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయనున్నాడట. ఆయన చెప్పిన ఒక వినూత్నమైన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నట్లు సమాచారం.