TG: భద్రాద్రి కొత్తగూడెంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దమ్మపేట మండలం గండుగలపల్లి ఏకలవ్య హాస్టల్లో ఈ ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం విద్యార్థులు చికెన్ తినగా అర్ధరాత్రి నుంచి 27 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. అయితే సిబ్బంది ఈ విషయాన్ని దాచి పెట్టి వైద్యం చేయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.