KRNL: 2025-26 రబీ సీజన్ పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది. రైతు సేవా కేంద్రాల వారీగా వివరాలు అందుబాటులో ఉంచారు. రైతులు తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా రైతు సేవా కేంద్రాల్లో గురువారం తెలియజేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. అభ్యంతరాలకు ఒక్కరోజు మాత్రమే అవకాశ౦ ఉ౦దని, ఈ-కేవైసీ లేదా బయోమెట్రిక్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయవచ్చని సూచించారు.