NRPT: పెద్ద జెట్రీమ్ రహదారి పక్కన ఉన్న సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కంచె లేకపోవడంతో చిన్నారులు, పశువులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.