KMM: సత్తుపల్లి(M) నారాయణపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు (58), పెనుబల్లి(M) పానెం సులోమన్(57) వేర్వేరు బైక్‌లపై సత్తుపల్లి వైపు వస్తుండగా.. బేతుపల్లి నుంచి వస్తున్న లారీ టర్నింగ్ వద్ద వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.