KMM: పారాక్వాట్ విషాన్ని నిషేధించి రైతుల ప్రాణాలను కాపాడాలని ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ అవగాహన కల్పించారు. పరాక్వాట్ తాగితే ప్రాణాలను కాపాడటం చాలా కష్టమని, ఇది ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని నాశనం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వాకర్స్ ఉన్నారు.