NLG: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు.