మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ (Sukhesh Chandrasekhar) రైల్వే మంత్రిత్వశాఖకు రూ. 10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. ఒడిశా(Odisha)లో ఇటీవల జరిగిన రైలు ప్రమాదం(train accident)లో తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను కోల్పోయి బాధల్లో ఉన్న పిల్లలు, విద్యార్థులు, యువత విద్యా అవసరాల కోసం తన స్వంత కష్టార్జితం నుంచి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav)కి రాసిన లేఖలో తెలిపాడు. ఒడిశా ప్రమాదం గురించి తెలిసిన తర్వాత అనాథలుగా, దిక్కులేనివారిగా మిగిలిపోయిన పిల్లల భవిష్యత్తు తనను ఆందోళనకు గురిచేసిందని, వారి చదువు అవసరాలు ఆగిపోకూడదని, వారి భవిష్యతు పై ప్రభావం పడొద్దన్న ఉద్దేశంతో ఈ విరాళాన్ని పంపుతున్నానని పేర్కొన్నారు. ఈ డబ్బును ఆ అవసరాలకు మాత్రమే ఖర్చు చేయాలని రైల్వే మంత్రి(Minister of Railways)కి రాసిన లేటర్లో తెలిపాడు.
ఒక బాధ్యత కలిగిన ‘మంచి’ పౌరుడిగా తాను తన స్వంత ఆదాయం నుంచి ఈ విరాళాన్ని సమకూరుస్తున్నానని, ఇదంతా చట్టబద్ధంగా ఆర్జించిందనేనని లేఖలో పేర్కొన్నారు. ఇక ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది చనిపోగా, 1200 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు స్పష్టమైన కారణమేంటనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ (CBI )దర్యాప్తు చేస్తోంది.సుకేశ్ చంద్రశేఖర్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల (Businessmen) నుంచి డబ్బులు వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ రాన్బాక్సీ యజమాని శివిందర్ మోహన్ సింగ్కు బెయిల్ ఇప్పిస్తానని అతని భార్య అదితి సింగ్ నుంచి 200 కోట్లు వసూలు చేశాడన్న అభియోగంపై జైలులో ఉన్నాడు.