ఒడిశా(Odisha)లోని కటక్‌లోని సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులను పోటీ ద్వారా ఎంపిక చేసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) తెలిపారు. సరస్వతీ విద్యా మందిర్ భూమి పూజ సందర్భంగా రైల్వే మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు.వందేభారత్ రైలు (Vande Bharat train) గురించిన వీడియోను విద్యార్థులకు చూపించి పోటీలు నిర్వహించి వారిలో ప్రతిభ కనబరిచిన 50 మంది విద్యార్థులను మంత్రి ఎంపిక చేసి వారికి ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించారు. మే 18న పూరీ నుండి హౌరా వరకు మొదటి వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) ప్రారంభించారు.ఇక ఇదే సమయంలో భువనేశ్వర్ (Bhubaneswar) రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులను కూడా కేంద్ర మంత్రి ప్రారంభించారు.
ప్రతిష్టాత్మకమైన భువనేశ్వర్ రాజధాని రైలుకు రేపటి నుంచి కొత్త ‘తేజస్’ రేక్ రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నది ప్రధాని మోదీ దార్శనికమన్నారు. కాగా, రేపు భువనేశ్వర్ రైల్వేస్టేషన్‌ను సందర్శించి పరిశీలిస్తామని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. వీటిలో ఖుర్దా రోడ్(Khurda Road)లోని 11 స్టేషన్లు సహా ఒడిశాలో మొత్తం 25 స్టేషన్లు ఉన్నాయి. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఈ 508 స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేశారు. వీటిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో 55 చొప్పున, బీహార్‌లో 49, మహారాష్ట్ర(Maharashtra)లో 44, పశ్చిమ బెంగాల్లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25, పంజాబ్‌లో 22, గుజరాత్-తెలంగాణ (Telangana) 21 చొప్పున, జార్ఖండ్ లో 20, ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల్లో 18 చొప్పున, హర్యానా 15, కర్ణాటక 13తో పాటు మరికొన్ని ఉన్నాయి.