వాకింగ్, యోగా.. శారీరక, మానసిక ప్రయోజనాలను చేకూర్చుతాయి. వాకింగ్ చేస్తూ యోగాసనాల్ని జత చేయటం వల్ల రెట్టింపు లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. గాలి పీల్చుతూ నాలుగు అడుగులు.. వదులుతూ నాలుగు అడుగులు, నడుస్తూనే భూజాల్ని, చేతుల్ని గుండ్రంగా తిప్పటం వంటివి చేస్తే కండరాలు దృఢంగా మారతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. బ్రీతింగ్ వ్యాయమాలు చేస్తాం కాబట్టి శ్వాస వ్యవస్థ మెరుగుపడుతుంది.