రోజూ కోట్ల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న.. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళిక వేసింది.
Indian Railway: నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణం చేస్తున్నారు. రెండు మూడు నెలల ముందు టికెట్ బుక్ చేసుకున్న కన్ఫార్మ్ కాని పరిస్థితి. తత్కాల్‌కి కూడా భారీ డిమాండ్ ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వెయిటింగ్ లిస్ట్‌కు బై బై చెప్పేందుకు భారత రైల్వే ప్రత్యేకంగా ఓ ప్రణాళిక రూపొందిస్తుంది. రూ.లక్ష కోట్ల ఖర్చుతో భారీగా రైళ్లను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పాత రైళ్ల స్థానంలో 7 వేల నుంచి 8 వేల కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నారు. రాబోయే నాలుగేళ్లలో కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రైన్లను అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం రైల్వేశాఖ నిత్యం 10,754 ట్రిప్స్ నడుపుతుండగా.. వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించేందుకు మరో మూడువేల ట్రిప్స్ పెంచాలని ప్రణాళికలు వేస్తోంది. కోవిడ్ తర్వాత 568 అదనపు ట్రిప్స్ నడిపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 5 వేల నుంచి 6 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేస్తామని రైల్వేశాఖ తెలిపింది.