ఘట్టమనేని అభిమానులకు రెండు రోజుల ముందే సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. 12వ తేదీ అర్థరాత్రి నుంచే గుంటూరు కారం షోష్ స్టార్ట్ కానున్నాయి. ఇప్పటికే ఓ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. జస్ట్ బుకింగ్స్‌తోనే బాక్సాఫీస్ బద్దలు చేస్తున్నాడు మహేష్ బాబు.
Guntur Kaaram: చాలా రోజులు మిస్ అయిన మాస్ మహేష్ బాబును గుంటూరు కారం సినిమాలో చూపించబోతున్నాడు త్రివిక్రమ్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో గుంటూరు కారందే హవా కనిపిస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో దుమ్ముదులిపేస్తున్నాడు సూపర్ స్టార్. జస్ట్ బుకింగ్స్‌తోనే 20 కోట్లకు పైగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో డే వన్ భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 65 కోట్లకుపైగా ఫస్ట్ డే గ్రాస్ నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
42 కోట్లకుపైగా షేర్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఓ రీజనల్ సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడమంటే మామూలు విషయం కాదు. అయితే.. ఇక్కడుంది మహేష్ బాబు. అసలు బాబు అంటేనే రీజనల్ కింగ్. రీజనల్ రికార్డ్స్ లేపడంలో మహేష్ తర్వాతే ఎవ్వరైనా. ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం ఓపెనింగ్స్ మామూలుగా ఉండవని అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా 135 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవుతోంది.
మహేష్ కెరీర్లోనే హెయెస్ట్ బిజినిస్ జరిగిన సినిమాగా గుంటూరు కారం వస్తోంది. పైగా మాస్ బొమ్మ అంటున్నారు కాబట్టి.. థియేటర్లో ఫ్యాన్స్ కుర్చీ మడతబెడితే, రికార్డుల పరంగా బాబు కుర్చీ మడతబెట్టడం గ్యారెంటీ. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.