»Green Signal To Karimnagar Hasanparthi Railway Line From Central Government
Bandi Sanjay : కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్‌కు కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !
ఉత్తర తెలంగాణ వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ (Karimnagar) – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.
నార్త్ తెలంగాణ (North Telangana) వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దశాబ్దాలకు పైగా పెండింగులో ఉన్న కరీంనగర్-హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ (New railway line) నిర్మాణానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.. నూతనంగా నిర్మించనున్న ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరమే నిధులు కేటాయింపుతో పాటు రైల్వే లైన్ నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీ బండి సంజయ్ న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్‌ను కలిసి కరీంనగర్(Karimnagar)-హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేశారు. ఇక దీనితో పాటు మరో శుభవార్త కేంద్రం తెలిపింది.
సిద్దిపేట (Siddipet) జిల్లాలోని కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కూడా కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. కరీంనగర్ – హసన్ పర్తి (Hasan Parthi) రైల్వే లేన్ విషయానికొస్తే… 2013లో ఈ రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా రైల్వే లైన్ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని ఈ సందర్భంగా బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణ అభివ్రుద్ధికి ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్ – హసన్ పర్తి ఈ రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. ప్రధాన ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీ తోపాటు వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణా సులువు కానుందని ఆయన తెలిపారు.