»Corona Tension In 8 States Central Government Warned
Corona Alert : ఆ 8 రాష్ట్రాల్లో కరోనా టెన్షన్..హెచ్చరించిన కేంద్రం
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న 8 రాష్ట్రాలను హెచ్చరిస్తూ లేఖలు రాసింది.
దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు(Corona Cases) పెరుగుతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశంలోని 8 రాష్ట్రాల(8 States)ను హెచ్చరిస్తూ లేఖ రాసింది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి రోజూ పెరిగే కేసుల సంఖ్య 11000కి చేరిపోయింది. దేశంలో యాక్టీవ్ కేసుల(Active Cases) సంఖ్య 66 వేలు దాటడంతో కేంద్ర అప్రమత్తమైంది.
దేశంలో కరోనా కేసులు(Corona Cases) అధికంగా పెరుగుతున్న 8 రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్(Rajesh Bhushan) లేఖలు రాశారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలను హెచ్చరిస్తూ కేంద్రం లేఖలు రాసింది. ఆయా రాష్ట్రాలు కరోనా పట్ల అలసత్వం వహించకుండా జాగ్రత్త పడాలని కేంద్రం కోరింది.
కరోనా వల్ల ఆస్పత్రిలో చేరి మరణించేవారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారిని ఈ దశలోనే నియంత్రించే చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్(Rajesh Bhushan) తెలిపారు. దేశంలో కరోనా కేసులు(Corona Cases) పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు, శానిటైజర్ వాడటం మర్చిపోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.