AP DGP: విశాఖ ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్ గురించి పూర్తి వివరాలను డీజీపీ రాజేంద్రనాథ్ (Rajendranath Reddy) మీడియాకు వివరించారు. డబ్బుల కోసమే హేమంత్, రాజేశ్, వలపుల రాజేశ్ కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. వీరికి జువైనల్ గోవర్ధన్ సాయం చేశాడని తెలిపారు. ఈ కేసులో బాలాజీ, సాయి, ఎర్రొళ్ల సాయి.. అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. మొత్తం 1.75 కోట్ల నగదు తీసుకున్నారని.. ఇప్పటివరకు 87.5 లక్షలు రికవరీ చేశామని చెప్పారు. మిగిలిన నగదు కూడా స్వాధీనం చేసుకుంటామని రాజేంద్రనాథ్ (Rajendranath Reddy) తెలిపారు. తమకు ఫిర్యాదు వచ్చిన గంటల్లోనే కేసు నమోదు చేస్తామని తెలిపారు. ముగ్గురు నిందితులను ఈ రోజు కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. రౌడీ షీటర్లు లేకుండా విశాఖ ప్రశాంతంగా ఉందని.. వాస్తవాలు నిర్ధారించుకొని రాయాలని మీడియాను కోరారు.
హేమంత్ అండ్ కో ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చారని డీజీపీ (dgp) తెలిపారు. వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని చెప్పారు. ఏడాదిలో 120 సీరియస్ కేసుల్లో 90 కేసుల్లో తీర్పు వచ్చిందన్నారు. సీరియస్ కేసుల్లో జీవిత ఖైదు పడిందని పేర్కొన్నారు. బాపట్ల, పల్నాడు దోషులను శిక్షిస్తున్నామని.. ఏలూరు ఘటనలో కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని చె్పపారు. 8 నెలల్లో తీర్పు వచ్చిన కేసులు ఉన్నాయా అని అడిగారు. విశాఖ, ఇతర కేసులను 3 నెలల్లో విచారణ పూర్తయి.. శిక్ష ఖరారు అవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో నేరాలు తగ్గాయని డీజీపీ (dgp) వివరించారు. 60 వేల కేసులు తగ్గాయంటే క్రైమ్ రేట్ తగ్గినట్టు కాదా అని అడిగారు. ఏ కేసుకు సంబంధించిన సమాచారం కావాలన్నా సరే తమను సంప్రదించాలని.. తప్పులు రాసి జనాలను భయపెట్టొద్దని కోరారు. ఏపీలో గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపామని.. సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తోందని వివరించారు. ఒడిశా (odisha) కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిందన్నారు. విశాఖలో రౌడీ షీటర్లు లేరని.. సిటీ ప్రశాంతంగా ఉందన్నారు. గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపామని చెబుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏ విషయంపైనైనా అవగాహనతో వార్త రాయాలని.. మీడియా ప్రతినిధులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.