మహిళా ఐపీఎస్ అధికారి(IPS officer)పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తమిళనాడు(Tamil Nadu) మాజీ డీజీపీ రాజేశ్ దాస్‌ను విల్లుపురం కోర్టు (Villupuram Court) దోషిగా తేల్చింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఓ మహిళా ఐపీఎస్ 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశారు. పళనిస్వామి (Palaniswami) సభకు బందోబస్తు నిర్వహించేందుకు వాహనంలో వెళ్తున్న సమయంలో సీనియర్ ఐపీఎస్ తనను లైంగికంగా వేధించాడని అందులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు చేపట్టిన అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం.. రాజేష్ దాస్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణ జరిపించింది.
ఐపీఎస్ అధికారి లైంగిక వేధింపుల అంశం 2021 అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సమయంలో ప్రచారాస్త్రంగా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ఎంకే స్టాలిన్ (MK Stalin) హామీ ఇచ్చారు. మరోవైపు ఈ కేసును అప్పట్లో మద్రాస్ హైకోర్టు (Madras High Court) కూడా తీవ్రంగా పరిగణించింది. డీజీపీ స్థాయి వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న మహిళా ఐపీఎస్‌ను మరో అధికారి అడ్డుకోవడం షాక్‌కు గురిచేస్తోందని అభిప్రాయపడింది. ఈ కేసు దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఈ కేసులో తీర్పు ఇస్తూ దాస్ కి మూడేళ్ల జైలు శిక్ష, 10వేలు జరిమానా వేధించింది..