AP: రాష్ట్ర ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలకు ప్రేరణ అని మంత్రి లోకేష్ వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పారు. సాంకేతికత అనేది ఒక సాధన మాత్రమేనని.. నిజమైన మార్పు సాంస్కృతికంగా జరగాలని ఆకాంక్షించారు. వాట్సాప్ సేవల ద్వారా హాల్ టిక్కెట్లు తీసుకోవడం నుంచి కరెంట్, ఇతర బిల్లులు చెల్లించడం గొప్ప మార్పన్నారు.