కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంట్లో ఒక స్వచ్ఛ కార్యకర్త ఉండాలని నగర కమిషనర్ పీ. విశ్వనాథ్ అన్నారు. బుధవారం పాఠశాల, కళాశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి స్వచ్ఛ సర్వేక్షన్లో విద్యార్థుల పాత్రను వివరించారు. విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, డస్ట్బిన్లు ఏర్పాటు చేసి తడి–పొడి చెత్త వేర్వేరుగా నిర్వహించాలన్నారు.