WGL: సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశీలించిన ఆమె పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వల పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.