WNP: గోపాలపేట మండలనికి చెందిన ప్రముఖ రిపోర్టర్ జోగు రాములు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అతన్ని పరామర్శించారు. రాములు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం నా సహాయ సహకారాలు ఉంటాయని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.