అన్నమయ్య: రాయచోటి బస్టాండ్లో ఆర్టీసీ కార్గో సెంటర్ను టీడీపీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్గో సేవలను విస్తృతం చేసి నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.