CTR: జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ వెదురుకుప్పం మండలంలో గురువారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పర్యటనలో భాగంగా పాత గుంట గ్రామంలో రాత్రి 7 గంటలకు పల్లెనిద్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటారని వెల్లడించారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.