కృష్ణా: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా SI సురేష్ సిబ్బందితో కలిసి హనుమాన్ జంక్షన్లో వాహన తనిఖీలు బుధవారం నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్షూరెన్స్, పొల్యూషన్ పత్రాలను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలాన్లు విధించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినవారిపై చర్యలు తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు.