MLG: ములుగుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో మాస్టర్ ప్లాన్ తో పనుల అమలు, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుతంగా విజయవంతం చేసినందుకు గాను వారిని సన్మానించారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.