W.G: భీమవరం కలెక్టరేట్లో జేసీ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై సంబంధిత అధికారులు, గ్యాస్ ఏజెన్సీల యాజమాన్యాలతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపారు. అవసరానికి మించి గ్యాస్ బుక్ చేయవద్దని సూచించారు.