కోనసీమ: అయినవిల్లి మండలంలో శానపల్లిలంక గరువులో దారుణం చోటుచేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల యడ్ల సూరిబాబు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయినవిల్లి ఎస్సై జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో వృద్ధుడిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.