AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. అయితే ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మూడేళ్ల బాలుడు జయకృత్ మృతి చెందాడు. 25 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కల్తీ పాల వల్ల కిడ్నీతో పాటు వివిధ శరీర భాగాలు ఫెయిల్యూర్ అవడం వల్ల మృతి చెందాడని తెలిపారు.