PPM: కొమరాడ తహసీల్దార్‌గా కె రత్నకుమారి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే వినతులను పరిష్కారం అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా రీ సర్వేలో తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.