SRPT: ప్రమాద రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూర్యాపేట డీఎస్పీ వీ.ప్రసన్నకుమార్ అన్నారు. బుధవారం చివ్వేంల మండలం ఉండ్రుగొండలో ‘అరైవ్ అలైవ్ అవగాహన సదస్సు నిర్వహించి, సోలార్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సీఐ రాజశేఖర్, ఎస్సైలు మహేష్, కనకరత్నం ఉన్నారు.