TG: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. RRB ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పదోన్నతుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.