కోనసీమ: మల్కిపురం మండలం దిండి, చించినాడ బ్రిడ్జి బేరింగ్ల మార్పు పనుల వల్ల 14 రోజుల పాటు రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి బుధవారం తెలిపారు. ఈ నెల 12, 15, 18, 21, 24, 27, 30 తేదీలతో పాటు ఏప్రిల్ 2, 5, 8, 11, 16, 21, 26 తేదీల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు.