TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని BJP ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ పేరుతో కాలం వెళ్లబుచ్చి.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా క్లీన్చిట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణను పార్టీ ఫిరాయింపులకు ఒక ప్రయోగశాలగా తయారు చేశారన్నారు.