VZM: ఈనెల 14న ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఉగాది సంబరాలు’ కార్యక్రమ పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంస్కృతి, సంప్రదాయాలకు, లలిత కళలకు విజయనగరం పుట్టినిల్లు వంటిదని కొనియాడారు. ఆరోజు 100మంది చిన్నారులతో నృత్య ప్రదర్శనలు జడ్పీ సమావేశ మందిరంలో ఉంటాయన్నారు.