టాటా మోటార్స్ ఐకానిక్ SUV మోడల్ ‘సియెర్రా’కి దేశీయ మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దీని బుకింగ్స్ 1 లక్ష మార్కును దాటడంతో, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. జనవరి నుంచి ఇప్పటివరకు 14,000 పైగా వాహనాలు డెలివరీ అయ్యాయి. Q2 నాటికి నెలకు 15 వేల యూనిట్ల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ తెలిపింది.