సత్యసాయి: హిందూపురం పట్టణంలోని 36వ వార్డు ముద్దిరెడ్డి పల్లి ప్రాంతంలో జరుగుతున్న కొత్త రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ డీఈ రమేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూపురం అభివృద్ధి కోసం ఇటీవల విడుదలైన రూ.92.50 కోట్ల నిధులతో పట్టణంలో కొత్త రోడ్లు, కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.