కృష్ణా: అవనిగడ్డలో మద్యం MRP కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని SMలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఎక్సైజ్ శాఖ CI గిరిజ తెలిపారు. బుధవారం నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తమ సర్కిల్ పరిధిలో మద్యం విక్రయాలు MRP ధరకే జరుగుతున్నాయన్నారు. ఎక్కడైనా ఎక్కువ ధర వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.