AP: వెలగపూడి సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో తుళ్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విధుల్లో ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని ఆరా తీస్తున్నారు. సమీప పొలంలో నిప్పు పెట్టడంతోనే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.