TG: వడ్డెర కార్పొరేషన్‌కు రాబోయే బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ రాశారు. కుల వృత్తుల కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన కులాలను ప్రోత్సహించేందుకు వడ్డెర సామాజిక వర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. వడ్డెర కులస్తులు నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.