JGL: మల్యాల మండలం కొండగట్టులో 36వ గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభమైంది. సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఆధ్వర్యంలో తెల్లవారు జామున గిరిప్రదక్షిణ ప్రారంభం కాగా, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి గిరి ప్రదర్శనలో పాల్గొనడానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ‘అంజన్న’ నామస్మరణతో కొండగట్టు ప్రాంతం మార్మోగుతుంది.