SKLM: మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ.. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన అభ్యుదయ సైకిల్ ర్యాలీ యాత్ర ఇవాళ ఇచ్ఛాపురంలో ముగియనుంది. అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అనిత, శ్రీనివాస్, అచ్చెన్నాయుడుతో పాటుగా ఎమ్మెల్యే అశోక్ పాల్గొంటారు.