కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పౌర్ణమి సందర్భంగా నేడు ఉదయం 9:30 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆలయ తనిఖీ అధికారి శుక్రవారం తెలిపారు. కళ్యాణ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేశామన్నారు. కోదండ రామయ్య పరిణయం, ఆర్జిత సేవకు హాజరు కావాలంటే ఒక్కో టిక్కెట్టుకు రూ.వెయ్యి చెల్లిస్తే ఇద్దరికి అనుమతి ఇస్తామన్నారు.