Governor Tamilisai Soundararajan Made Hot Comments
Governor Tamilisai Soundararajan: తెలంగాణ ప్రభుత్వం- గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ (Governor Tamilisai Soundararajan) మధ్య ఉప్పు-నిప్పుగా ఉంది సిచుయేషన్. ఏ బహిరంగ వేదిక.. లేదంటే సోషల్ మీడియా వేదికగా గవర్నర్.. ప్రభుత్వ తీరును తప్పుపడతారు. ఆ వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలు మైక్ అందుకుంటారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళి సై పాల్గొన్నారు. గత రెండేళ్ల నుంచి తాను ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నానని తెలిపారు.
అందుబాటులో లేని వైద్యాశాఖ అధికారులు
రెండేళ్ల నుంచి తనకు వైద్యారోగ్య శాఖ అధికారులు అందుబాటులో లేరని తమిళి సై (Tamilisai Soundararajan) అంటున్నారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలం అని పేర్కొన్నారు. పరిస్థితులకు తగినట్టు స్పందించడంతో పనిభారం లేకుండా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. లైంగిక వేధింపులపై బాల్యం నుంచే ఆడపిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. పేరంట్స్ సమయం ఇస్తే పిల్లలు సమయం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు.
మహిళ విజయం
ఆరోగ్య బీమాపై అవగాహన పెరగాలని తమిళి సై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) సజెస్ట్ చేశారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలతో పేదలకు మెరుగైన వైద్యం అందజేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఓ మహిళ విజయం వెయ్యి మంది పురుషుల విజయంతో సమానం అని పేర్కొన్నారు. ఇటు గవర్నర్ పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. ఉదయం 11.30 గంటలకు బోరబండలో నాట్కో స్కూల్లో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌నకు హాజరయ్యారు. ఆమె వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బందిలోని ఇద్దరి ఫోన్లు పోయాయి. గవర్నర్ వ్యక్తిగత భద్రత ఉంటుంది. వారిని దాటి ఎవరో ఫోన్లు తీసుకోవడం కలకలం రేపింది.
వైద్యరంగంలో భేష్
మరోవైపు వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్ ఆస్పతులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీ పడుతున్నాయని తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో.. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్‌లో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. 14వ తేదీ నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందజేస్తామని వివరించారు.