Ileana Emotional Post: ప్రియుడి ఫోటో షేర్ చేస్తూ ఇలియానా ఎమోషనల్ పోస్ట్
నటి ఇలియానా తన లవర్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గర్భతిని కావడం సంతోషంగా ఉందని చెబుతూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘దేవదాసు’ సినిమా(Devadasu Movie)తో టాలీవుడ్(Tollywood)లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా(Ileana) ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులో అనేక సినిమాల్లో అగ్రహీరోల సరసన నటించింది. అటు హిందీలోనూ అవకాశాలు తలుపుతట్టాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్(Bollywood)కి వెళ్లి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలోనూ నటించడం లేదు. సరైన అవకాశాలు లేకపోవడంతో వెండి తెరకు బ్రేక్ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటోంది.
ఈమధ్యనే ఇలియానా(Ileana) తాను తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. ఇక అప్పటి నుంచి బేబీ బంప్ ఫోటోల(Baby Bumb Photos)ను షేర్ చేస్తూ వస్తోంది. ఇటీవలె తన బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూ తన బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అప్పుడే నెటిజన్ల నుంచి ఆమెకు పలు రకాల కామెంట్స్ వచ్చాయి. తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని చాలా మంది అడిగారు. కానీ వాటికి ఇలియానా రియాక్ట్ కాలేదు.
ఎట్టకేలకు తన ప్రియుడి ఫోటోను షేర్ చేస్తూ ఇలియానా ఎమోషనల్ పోస్ట్(Ileana Emotional Post) పెట్టింది. ప్రెగ్నెన్సీ(Prgnency) అనేది ఒక అందమైన వరమని, తానెప్పుడు ఆ అదృష్టం తనకు ఉందని అనుకోలేదని, తన బేబీ బంప్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపింది. త్వరలోనే తన బిడ్డను కలవబోతున్నందుకు ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. ఒకప్పుడు చెప్పలేనంత కష్టంగా ఉండేదాన్నని, ఇప్పుడు ఆ కష్టం పోయిందని, తన కన్నీళ్లు తుడిచి తనకు అండగా నిలిచిన వ్యక్తికి ఆమె తన ప్రేమను అందిస్తున్నట్లు తెలిపింది. నోట్ షేర్ చేసినప్పటికీ ఆమె తన బాయ్ ఫ్రెండ్ను మాత్రం పూర్తిగా చూపించలేదు. దీంతో మరోసారి ఆమె పోస్టుకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.