Minister Roja: మంత్రి రోజాకు అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
ఏపీ మంత్రి రోజా కాలినొప్పి, వాపు సమస్యలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా(Minister Roja) స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరారు. రోజా ప్రస్తుతం కాలునొప్పి, వాపుతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో చికిత్స నిమిత్తం ఆమె చెన్నైలోని థౌజండ్ లైట్స్‌లో ఉన్న అపోలో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం రాత్రి చెన్నైలోని తన ఇంట్లో కుటుంబసభ్యులతో ఉన్న రోజా ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో ఆందోళన నెలకొంది. అర్ధరాత్రి కుటుంబసభ్యులు ఆమెను అపోలో అస్పత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం రోజా(Minister Roja)కు అపోలో ఆస్పత్రిలో వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. రోజా ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉందని, వాపు కూడా తగ్గిందని వైద్యులు తెలిపారు. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి రోజా అస్వస్థతకు గురైందనే వార్తలతో వైసీపీ కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. చివరికి ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలుపడంతో ఊపిరి పీల్చుకున్నారు.
‘గెట్ వెల్ సూన్ మినిస్టర్ రోజా’ అంటూ వైసీపీ అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. రోజా(Minister Roja) అస్వస్థత, ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె కోలుకుని త్వరగా ఇంటికి చేరుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.