NZB: ఎస్సీ నిరుద్యోగ యువత నుంచి స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈవీ టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ పంపు సెట్ల కోసం మార్చి 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక రేషన్ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణులకు రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదన్నారు.