SRD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని కంది పరిధిలోని కన్వెన్షన్లో ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రామపంచాయతీ సర్పంచులు అవగాహన సమావేశంలో పాల్గొనాలన్నారు.