TG: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌పై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ భూ వివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. భూ వివాదంలో ఎమ్మార్వో అనిల్ అత్యుత్సాహం ప్రదర్శించారని.. బాధితుడి పట్ల పక్షపాతంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.