KDP: కమలాపురం(మం) దేవరాజుపల్లెలో గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని, బుధవారం స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెరటి కోళ్లను ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదలకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.