SKLM: కోటబొమ్మాళి మండలం దుప్పిలిపాడులో మంగళవారం పోలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ జగన్మోహన్రావు సెనగ, పెసర, మినుము, వరిచేలు పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. సస్యరక్షణ చేసే పద్ధతిని చీడపీడల భారి నుంచి పంటలను కాపాడుకునే విధానాన్ని రైతులకు వివరించారు. వేరుశనగ పంటలో ఎకరాకు 4 బస్తాల జిప్సం వినియోగించాలన్నారు.